/rtv/media/media_files/2026/01/30/dhurandhar-telugu-ott-2026-01-30-07-02-32.jpg)
Dhurandhar Telugu OTT
Dhurandhar Telugu OTT: ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన బాలీవుడ్ మూవీ ‘ధురందర్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్ల వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పుడు సినీ లవర్స్‌కు డిజిటల్ వేదికపై కూడా వినోదాన్ని అందించనుంది.
రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా(Akshay Khanna), సంజయ్ దత్(Sanjay Dutt), ఆర్. మాధవన్(R. Madhavan), అర్జున్ రాంపాల్(Arjun Rampal) కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను ఆదిత్య ధర్(Aditya Dhar) స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించింది.
DHURANDHAR ⚔️
— Netflix India (@NetflixIndia) January 29, 2026
Watch the Epic Saga unfold. Now out on Netflix in Hindi, Tamil and Telugu 🌪️🔥#DhurandharOnNetflixpic.twitter.com/yQhFTrJFEX
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలై రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా జనవరి 30 (శుక్రవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాతో సారా అర్జున్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది.
కథ ఏంటి అంటే..?
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కథ మొదలవుతుంది. భారత్‌పై పాకిస్థాన్ నుంచి తరచూ ముప్పు ఏర్పడుతుండటంతో, భారత ఇంటెలిజెన్స్ ఓ ప్రత్యేక ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా సైనిక శిక్షణ పొందిన హంజా అలీ మజారీని అండర్‌కవర్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌లోని కరాచీకి పంపిస్తారు. అక్కడ ల్యారీ అనే ప్రాంతంలో జ్యూస్ షాప్‌లో వెయిటర్‌గా, క్లీనర్‌గా పని చేస్తూ స్థానిక రాజకీయాలు, గ్యాంగ్ గొడవలు, వ్యవస్థను గమనిస్తుంటాడు. ఒక సందర్భంలో పఠాన్ గ్యాంగ్‌పై దాడి జరిగే సమయంలో రెహమాన్ అనే గ్యాంగ్ లీడర్ చిన్న కుమారుడిని హంజా కాపాడుతాడు.
ఆ తరువాత అతడు రెహమాన్ గ్యాంగ్‌లో చేరి, క్రమంగా కీలక స్థాయికి చేరుకుంటాడు. రెహమాన్‌ను ఎన్‌కౌంటర్ నుంచి బయటపడేసే వరకు కథ ఆసక్తికరంగా సాగుతుంది. చివరకు హంజా నిర్ణయాలు, అతడు ఎదుర్కొన్న పరిణామాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా మొత్తం ఉత్కంఠభరిత సన్నివేశాలతో నడుస్తూ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. కొన్ని చోట్ల హింసాత్మక సన్నివేశాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. అయితే అసభ్యకరమైన సన్నివేశాలు మాత్రం లేవు.
నిడివి ఎక్కువైనా బోర్ లేదు
మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. చివరికి “ఇంకాస్త ఉంటే బాగుండేది” అనిపించేలా కథ ముగుస్తుంది. థియేటర్‌లో మిస్ అయినవారు, ఇప్పటికే చూసినవారు కూడా మరోసారి చూడదగ్గ సినిమా ఇది.
బాక్సాఫీస్ రికార్డులు (Dhurandhar Box Office Collections)
భారత బాక్సాఫీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.891.65 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ కలెక్షన్ సుమారు రూ.1052 కోట్లకు పైగా ఉంది. 55వ రోజు కూడా సినిమా వసూళ్లు రాబట్టడం విశేషం. ఎనిమిదో వారం కలెక్షన్లలో ‘స్త్రీ 2’ సినిమాను కూడా దాటేసింది. కొత్త సినిమాల పోటీ కారణంగా కలెక్షన్లు కొంత తగ్గినా, రికార్డుల పరంగా ‘ధురందర్’ ఇంకా దూసుకుపోతోంది.
మొత్తానికి.. యాక్షన్, స్పై థ్రిల్లర్, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉండటంతో, ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌ను అందిస్తోంది..
Follow Us