/rtv/media/media_files/2026/01/16/dhanush-mrunal-marriage-2026-01-16-14-54-59.jpg)
Dhanush Mrunal Marriage
Dhanush Mrunal Marriage: బాలీవుడ్ వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. నటుడు ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా సరే, ఇప్పుడు బాలీవుడ్ మీడియా మరో అడుగు ముందుకెళ్లి, ఈ జంట ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు రాస్తోంది.
ప్రస్తుతం ధనుష్, మృణాల్ ఇద్దరూ తమ తమ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి విషయమై స్పష్టమైన సమాచారం మాత్రం బయటకు రాలేదు. అయినా కూడా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఈ వార్త వేగంగా వైరల్ అవుతోంది.
గత ఏడాది ఆగస్టులో ఈ రూమర్లకు బలమొచ్చింది. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రీమియర్ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలైంది. ఆ సమయంలో మీడియా ప్రశ్నించగా, మృణాల్ స్పందిస్తూ ధనుష్ తనకు “మంచి స్నేహితుడు మాత్రమే” అని చెప్పింది. తన సహనటుడు అజయ్ దేవగన్ ఆహ్వానంతోనే ధనుష్ ఆ ప్రీమియర్‌కు వచ్చారని స్పష్టం చేసింది.
ఇటీవల ఫ్రీ ప్రెస్ జర్నల్ అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం, ధనుష్, మృణాల్ ఫిబ్రవరి 14న వివాహం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందుకే ఇది నిజమా కాదా అనేది వేచి చూడాల్సిందే.
మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె టెలివిజన్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె ‘సీతా రామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఇక ధనుష్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే, ఆయన 2004 నవంబర్ 18న సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2022 జనవరి 17న ధనుష్, ఐశ్వర్య తమ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు మృణాల్‌తో పెళ్లి వార్తలు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే నిజం ఏంటో తెలియాలంటే ధనుష్ లేదా మృణాల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Follow Us