Demonte Colony 2: 'డీమాంటే కాలనీ' సీక్వెల్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ 'డిమాంటే కాలనీ 2'. తమిళ్ హీరో అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. 8 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ 'తంగళన్' వంటి భారీ చిత్రాలకు పోటీగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ పొందింది. ఇప్పటివరకూ థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ అలరించేందుకు సిద్ధమైంది.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
దీపావళి కానుకగా టీవీలో
'డీమాంటే కాలనీ 2' దీపావళి కానుకగా టీవీలో సందడి చేయబోతుంది. అక్టోబర్ 31న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకు ప్రీమియర్ కానుంది. థియేటర్లో మిస్సైన వారు టీవీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా 'జీ5' సొంతం చేసుకుంది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలిమ్స్, జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై విజయ సుబ్రహ్మణ్యం, ఆర్సి రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్
ఈ చిత్రంలో మీనాక్షి గోవింద్రాజన్, సరనో ఖాలిద్, ఆన్తి జాస్కేలైనెస్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడేవారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా 'డీమాంటే కాలనీ 2' కి మంచి ప్రేక్షకాదరణ లభించడం విశేషం. తెలుగులో ఈ మూవీ ఆగస్టు 23న విడుదలైంది.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి