/rtv/media/media_files/2025/12/23/ravi-babu-2025-12-23-12-26-29.jpg)
Ravi Babu
Ravi Babu: క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు తాజాగా తన కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ఏనుగు తొండం ఘటికాచలం సినిమ థియేటర్లకు కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పుడు రవిబాబు మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
Ravi babu back to his genre.
— Telugu70mm (@Telugu70mmweb) December 23, 2025
Waiting for his comeback
A Ravi Babu film.
Title glimpse out tomorrow, 10:30 am. #RaviBabupic.twitter.com/pvBZsnTV3m
ఈ కొత్త సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ చాలా వింతగా, ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ ఏర్పడింది. పోస్టర్‌ను చూస్తే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని అర్థమవుతోంది. రవిబాబు స్టైల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భిన్నమైన కథతో ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం 10:30 గంటలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. టైటిల్, నటీనటులు, అలాగే టెక్నికల్ టీమ్ వివరాలు అన్నీ ఒకేసారి ప్రకటించనున్నారు. దీంతో రవిబాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తోంది. ఈ రెండు బ్యానర్లు కలిసి పనిచేయడం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. మంచి కంటెంట్‌తో పాటు క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
రవిబాబు ఇప్పటివరకు భిన్నమైన కథలు, కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి కూడా ఆయన అదే తరహాలో ఒక కొత్త క్రైమ్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. రేపు రానున్న అధికారిక ప్రకటనతో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరగడం ఖాయం.
Follow Us