Comedian Satya: హీరోగా స్టార్ కమెడియన్ సత్య.. ఆ డైరెక్టర్ తో ఊరమాస్ సినిమా..!

కమెడియన్ సత్య, దర్శకుడు రితేష్ రాణా కొత్త సినిమాలో హీరోగా నటించనున్నాడు. 'మత్తు వదలరా' సిరీస్ తర్వాత వీరిది ఇది రెండో సినిమా. ఈ ఫన్ ఎంటర్టైనర్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సమాచారం. సత్య ప్రస్తుతం 'పెద్ది' సహా పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.

New Update
Comedian Satya

Comedian Satya

Comedian Satya: తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ నటులు హీరోలుగా మారడం కొత్త విషయం కాదు. బ్రహ్మానందం, వేణు, వెన్నెల కిషోర్ వంటి పలువురు హాస్యనటులు గతంలో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరబోతోంది.

ఇటీవలి కాలంలో సత్య తెలుగు సినిమాల్లో అత్యంత బిజీ కామెడీ నటులలో ఒకరుగా మారాడు. ఆయన డైలాగ్ టైమింగ్, నటన ప్రేక్షకులకు బాగా నచ్చడంతో, పెద్ద సినిమాల నుండి చిన్న చిత్రాల వరకూ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

సత్యకు మంచి పేరు గుర్తింపు తెచ్చిన చిత్రం మత్తు వదలరా సిరీస్. ఈ సిరీస్‌లో సింహ కొడూరి హీరోగా నటించగా, రితేష్ రాణా(Ritesh Rana) ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. రెండు పార్ట్స్ లోను సత్య పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన కామెడీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది.

పూర్తి స్థాయి హీరోగా..

ఇప్పుడు అదే దర్శకుడు రితేష్ రాణా మళ్లీ సత్యతో చేతులు కలపబోతున్నాడు. ఈ కొత్త సినిమా కూడా ఆయన స్టైల్లో ఉండే ఒక ఫన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. ముఖ్యంగా, ఈసారి సత్యనే పూర్తి స్థాయి హీరోగా చూపించబోతున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించబోతున్నారని సమాచారం.

ఇకపోతే, సత్య ప్రొఫెషనల్‌గా కూడా బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా చాలా కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు.

కామెడీ నటుడిగా మొదలైన సత్య, ఇప్పుడు హీరో స్థాయికి చేరుకోవడంతో కామెడీ లవర్స్ ఈ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఆయనను ప్రధాన పాత్రలో చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. రితేష్ రాణా దర్శకత్వంలో సత్య హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు