Chiranjeevi MSG Collections: రఫ్ఫాడించిన బాస్.. నైజాం డే 1 కలెక్షన్స్ చిరు రికార్డ్!

చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి టాక్‌తో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల వసూళ్లు సాధించింది. నైజాంలో రూ.7.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Chiranjeevi MSG Collections

Chiranjeevi MSG Collections

Chiranjeevi MSG Collections: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదలై మొదటి రోజే మంచి రెస్పాన్ అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. తాజాగా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా ఈ సినిమా వసూళ్ల వివరాలను ప్రకటించింది. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించింది. ఇది చిరంజీవి కెరీర్‌లో మరో బలమైన ఓపెనింగ్‌గా చెప్పుకోవచ్చు.

Chiranjeevi MSG Day 1 Collections

ప్రత్యేకంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. నైజాం నుంచి మొదటి రోజే రూ.7.5 కోట్ల షేర్ (GST లేకుండా) వసూలైనట్లు సమాచారం. ఇందులో ప్రీమియర్ షోస్ వసూళ్లు కూడా ఉన్నాయి. 

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార భార్య పాత్రలో నటించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

కథ విషయానికి వస్తే.. శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మకు భద్రత చూసే బాధ్యత అతనిదే. మంత్రి శంకరవరప్రసాద్‌ను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తాడు. శంకరవరప్రసాద్ భార్య శశిరేఖ (నయనతార)తో విడిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసిన మంత్రి, అతని పిల్లలతో మళ్లీ కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు.

ఒక బోర్డింగ్ స్కూల్‌లో పీఈటీగా చేరిన శంకరవరప్రసాద్ తన పిల్లలకు దగ్గరయ్యాడా? భార్యాభర్తలు ఎందుకు విడిపోయారు? వాళ్లిదరు మళ్ళీ కలిసారా? వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్రతో శశిరేఖకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే మిగతా కథ.

మొత్తానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఫస్ట్ డేనే మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత స్థాయికి చేరుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు