Mana Shankara Vara Prasad Garu OTT: 'మన శంకర వర ప్రసాద్ గారు' ఓటీటీ ఎంట్రీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో చిత్రం “మన శంకర వర ప్రసాద్ గారు (MSG)” భారీ విజయం సాధించి ₹285 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే Zee5 డిజిటల్ హక్కులు దక్కించుకోగా, ఫిబ్రవరి 11న ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.

New Update
Mana Shankara Vara Prasad Garu OTT

Mana Shankara Vara Prasad Garu OTT

Mana Shankara Vara Prasad Garu OTT: ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు (MSG)”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.

జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు ₹285 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లో కూడా అత్యధిక వసూళ్లు వచ్చిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలకు కూడా మంచి లాభాలు వచ్చాయి.

ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను Zee5 సంస్థ సొంతం చేసుకుంది.

ముందుగా మార్చిలో టీవీ, ఓటీటీ రిలీజ్ ఒకేసారి ఉండొచ్చని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.

“మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా Zee5లో అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. హీరోయిన్ నయనతార నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే వెంకటేష్ చేసిన ప్రత్యేక పాత్రకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా, ఓటీటీలో కూడా మంచి రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు