Hey Balawanth: సుహాస్ సినిమాకు సెన్సార్ కష్టాలు.. రిలీజ్ కు ముందు టైటిల్ చేంజ్..!

టాలీవుడ్‌లో సెన్సార్ సమస్యలు పెరుగుతున్నాయి. సుహాస్ నటించిన “హే భగవాన్!” చిత్రానికి టైటిల్ సమస్య కారణంగా విడుదలకు నాలుగు రోజుల ముందు పేరు మార్చి “హే బల్వంత్!” గా పెట్టారు. సెన్సార్ వరుస టైటిల్ మార్పులు పరిశ్రమలో చర్చకు దారితీస్తున్నాయి.

New Update
Hey Balawanth

Hey Balawanth

Hey Balawanth: ఇటీవల టాలీవుడ్ సినిమాలకు సెన్సార్ సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని సినిమాల టైటిల్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెబుతోంది. సంతోష్ శోభన్ నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు కూడా టైటిల్ కారణంగా A సర్టిఫికేట్ ఇచ్చారు. పేరును మార్చాలని సూచించినా, టీమ్ అంగీకరించలేదు. అలాగే గత నెలలో వచ్చిన “వనర” అనే చిన్న సినిమా పేరు “వనవీర”గా మార్చాల్సి వచ్చింది.

ఇప్పుడు సుహాస్(Hero Suhas) హీరోగా వస్తున్న కొత్త సినిమా కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంది. సుహాస్, శివాని నాగరం జంటగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” తర్వాత కలిసి నటిస్తున్న సినిమా మొదట “హే భగవాన్!” అనే పేరుతో ప్రకటించారు. ఈ చిత్రానికి గోపీ అచ్చారా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో నరేష్ చేసే వ్యాపారం ఏమిటో చెప్పమని బహుమతితో పోటీ పెట్టి సినిమా పై ఆసక్తి పెంచారు.

కానీ సెన్సార్ బోర్డు ఈ టైటిల్‌పై కూడా అభ్యంతరం తెలిపింది. దాంతో విడుదలకు నాలుగు రోజులు ముందు సినిమాకు “హే బల్వంత్!” అనే కొత్త పేరు పెట్టారు. ఇలా వరుసగా టైటిల్స్ మారుతున్న విషయం పరిశ్రమలో చర్చకు దారితీసింది.

ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కథను “రైటర్ పద్మభూషణ్” ఫేమ్ శణ్ముఖ ప్రశాంత్ రాశారు. సుదర్శన్, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు