OTT Update: బ్లాక్‌బస్టర్ ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్.. ఇక్కడ చూసేయండి..!

రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇది 2022 బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ ప్రీక్వెల్. థియేటర్లలో హిందీ వెర్షన్ ₹200 కోట్లు వసూళ్లను సాధించి సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.

New Update
OTT Update

OTT Update

OTT Update: ఇండియన్ సినిమాల్లో పెద్ద సంచలనం సృష్టించిన ‘కాంతారా చాప్టర్ 1’ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ భారీ ప్రీక్వెల్, 2022లో విడుదలైన అసలు ‘కాంతార’ సినిమాకు ముందు జరిగే కథ. విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం, అన్ని భాషల్లో కలిపి ₹800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ ఏడాది భారతీయ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది. విమర్శకులు, ప్రేక్షకులిద్దరూ ఈ చిత్రానికి ప్రశంసలు కురిపించారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు ఇప్పటికే అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) నియమాల ప్రకారం, హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలి. అందుకే ఈ వెర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

థియేటర్లలో హిందీ వెర్షన్ భారీ విజయం Kantara Chapter 1 Hindi Version

కాంతార చాప్టర్ 1 హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా ఉత్తర భారతదేశంలో భారీ వసూళ్లు సాధించింది. హిందీ బాక్సాఫీస్‌లోనే ₹200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ రావడం విశేషం. ఈ భారీ విజయమే సినిమాకు మొత్తం ఇండియాలో పెద్ద హిట్ అయ్యేలా తోడ్పడింది అనే చెప్పాలి. దక్షిణ భాషలతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరించారు.

ఈ ప్రీక్వెల్‌లో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన విజయ్ కిరగందూర్ ఈ పెద్ద చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్ ని బలంగా చూపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దేవతా శక్తులు, స్థానిక సంస్కృతి, యాక్షన్ అంశాలను కలిపి రిషబ్ శెట్టి ప్రత్యేకమైన ప్రెజెంటేషన్ చూపించారు. కథలో చూపించిన సంప్రదాయాలు, అడవుల నేపథ్యం, గ్రామీణ వాతావరణం సినిమా ప్రధాన హైలైట్ అయ్యాయి. ప్రేక్షకులను భావోద్వేగానికి దగ్గరగా తీసుకెళ్లే విధంగా యాక్షన్, డ్రామా మేళవించారు.

మొత్తం మీద… ఇప్పటికే థియేటర్లలో పెద్ద విజయం సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా OTTలో అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో రావడంతో మరింత మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసే అవకాశం పొందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు