యష్మీ ఎలిమినేటెడ్.. దీని వెనుక అసలు కారణం ఇదే..? సీరియల్ నటి యష్మీ గౌడ ఈ వారం బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5 వరకు పక్కా ఉంటుందని భావించిన యష్మీ ఇలా 11వ వారంలోనే ఎలిమినేట్ అవ్వడం షాకిచ్చింది. అసలు యష్మీ ఎలిమినేషన్ కి కారణాలేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 24 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుందగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. 2/7 బిగ్ బాస్ లో అడుగుపెట్టిన యష్మీ మొదటి వారంలోనే బిగ్ బాస్ ఇంటి మొదటి చీఫ్ గా ఎన్నికై అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత రెండు వారాలు కాస్త డల్ అయిన యష్మీ.. మూడో వారంలో నామినేషన్ ప్రక్రియలో సోనియా పై మాటలతో విరుచుకుపడింది. 3/7 పృథ్వీ, నిఖిల్ విషయంలో సోనియా గురించి బుల్లెట్ పాయింట్స్ మాట్లాడి నామినేషన్ లో అల్లాడించింది. ఆడియన్స్ ఏం అనుకుంటున్నారో.. అవే మాటలు యష్మీ కూడా సోనియా మొహం పైనే చెప్పడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. 4/7 సోనియా నామినేషన్ తరవాత యష్మీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అంతా యష్మీ టాప్ 5 కన్ఫర్మ్ అని అనుకున్నారు. కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి యష్మీ తన ఆటను పూర్తిగా పక్కన పెట్టేసింది. 5/7 సోనియా వెళ్లిన తర్వాత ఆమె ప్లేస్ ని.. యష్మీ భర్తీ చేసింది అనే ఫీలింగ్ కలిగించింది ప్రేక్షకులలో. ఎంత సేపు నిఖిల్ తో ఫ్రెండ్షిప్, ఫీలింగ్స్ అంటూ అక్కడికే తన ఆటను పరిమితం చేసింది. ఇదే ఈరోజు ఆమె ఎలిమినేషన్ కి కారణమని యష్మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 6/7 ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చాక.. యష్మీ ఆట చాలా తక్కువగా కనిపించింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆమె మాటలు ఫ్లిప్ చేసిన విధానం, నిఖిల్ ఇష్యూ ఆమెకు ప్రేక్షకుల్లో కొంత నెగెటివిటీ తీసుకొచ్చిందని టాక్. ఇది కూడా యష్మీ ఎలిమినేషన్ కి ఒక కారణం. 7/7 వీటితో పాటు ఈ వారం కే బ్యాచ్ అంతా నామినేషన్స్ లోకి రావడం పెద్ద మైనస్ అయ్యింది. పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణ ఒకేసారి నామినేషన్స్ లో ఉండడంతో ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. ఇది కూడా యష్మీ ఎలిమినేషన్ కి కారణమై ఉండొచ్చని టాక్. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి