Bigg Boss Telugu 8: గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు.
దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో
తాజాగా బిగ్ బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశాడు. లక్కీ భాస్కర్, అమరన్, క మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ, సాయి పల్లవి, శివకార్తికేయన్, కిరణ్ అబ్బవరం బిగ్ బాస్ స్టేజ్ పై గెస్టులుగా సందడి చేశారు. సెలెబ్రెటీల నవ్వులు, కంటెస్టెంట్స్ ఆట, పాటలతో ప్రోమో అంతా ఎంటర్ టైనింగ్ గా సాగింది. సెప్టెంబర్ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని హోస్టుగా వ్యవహరించిన రెండో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే
ఇది ఇలా ఉంటే.. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దాని పై నెట్టింట ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ వీక్ పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, నయని పావని బిగ్ బాస్ ఇంటి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఆరుగురిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన మెహబూబ్, నయని పావని డేంజర్ జోన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం వీరిద్దరూ లీస్ట్ ఉన్నారు. దీంతో మెహబూబ్ లేదా నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఎక్కువగా మెహబూబ్ పేరు వినిపిస్తోంది. మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ.. గత వారం
రిలీజియన్ పేరుతో ఓట్లు పడతాయని మాట్లాడడం జనాల్లో అతని పై కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇది కూడా తన ఎలిమినేషన్ కు కారణం కావచ్చని టాక్. సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన మెహబూబ్ 10 వారాల పాటు హౌస్ లో కొనసాగాడు.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. మెహబూబ్ ఎలిమినేటెడ్!