Bigg Boss 9: భరణికి ఇమ్మాన్యుయేల్ బిగ్ షాక్! నామినేషన్స్ లో దివ్య, తనూజ రచ్చ రచ్చ

బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు చప్పగా మారుతుంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 10వ వారంలోకి అడుగుపెట్టింది. 9 వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు.

New Update

Bigg Boss 9:  బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు చప్పగా మారుతుంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 10వ వారంలోకి అడుగుపెట్టింది. 9 వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. టాప్ 5 వరకు ఉంటాడని భావించిన రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేటై అందరికీ షాకిచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండలేకపోతున్నాను.. అమ్మ గుర్తుకు వస్తుంది అంటూ తానంతట తానే బయటకు వెళ్ళిపోయాడు. శనివారం ఎపిసోడ్ రాము ఎలిమినేట్ అవగా.. ఆదివారం ఎపిసోడ్ జనాల ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్న శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. 

నామినేషన్స్ రచ్చ 

తాజాగా 10వ వారం నామినేషన్ ప్రోమో విడుదలవగా.. దివ్య, తనూజ, సుమన్ శెట్టి ఫుల్ ఫైర్ మీద కనిపించారు. దివ్య, తనూజ గౌరవ్ పై రెచ్చిపోయారు. నామినేషన్స్ లో భాగంగా దివ్య, తనూజ ఇద్దరూ గౌరవ్ ని నామినేట్ చేశారు. 'నువ్వు అసలు గేమ్ లో కనిపించడం లేదు, త్వరగా గివప్ ఇచ్చేస్తున్నావు'  అనే పాయింట్ తో నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత సుమన్ శెట్టి వర్సెస్ నిఖిల్ ఆర్గుమెంట్ తో ప్రోమో రసవత్తరంగా సాగింది. 

ఇమ్మాన్యుయేల్ బిగ్ షాక్.. 

ఈ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ భరణికి బిగ్ షాకిచ్చాడు. మొదటి వారం నుంచి భరణితో ఎంతో స్నేహంగా, సపోర్ట్ గా ఉన్న ఇమ్మూ ఈ వారం ఆయననే నామినేట్ చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మీ ఆటలో ఫైర్ కనిపించట్లేదు.. ఎక్కడో తగ్గి ఆడుతున్నారని అనిపిస్తుంది అంటూ నామినేషన్ వేశాడు. ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేయడం ఆయనతో పాటు అందరికీ షాకిచ్చింది. 

Also Read: Rajamouli vs Telugu Media: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై వివాదం! తెలుగు మీడియా కెమెరాలకు నో ఎంట్రీ!

Advertisment
తాజా కథనాలు