/rtv/media/media_files/2025/01/11/ZwJQkuZnjd5DhptDyh6p.jpg)
balakrishna
Balayya: టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన 'సూపర్ సిక్స్' సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ సభకు బాలయ్య, నారా లోకేష్ కూడా హాజరు కావాల్సింది. కానీ, కాస్త అనారోగ్యంగా ఉండడంతో బాలయ్య సభకు రాలేకపోయారు అని అన్నారు. దీంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు బాలయ్యకు ఏమైంది? అని టెన్షన్ పడుతున్నారు.