Akhanda 2 Piracy: బాలయ్యకు భారీ దెబ్బ.. 'అఖండ 2' HD ప్రింట్ లీక్.. మరీ ఇంత క్వాలిటీతోనా..!

బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ లీక్ అయ్యింది. థియేటర్లలో ఫుల్‌హౌస్‌గా రన్ అవుతున్న ఈ సినిమా పైరసీ కారణంగా కలెక్షన్లకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. దీనిపై ఫ్యాన్స్, చిత్రబృందం కఠిన చర్యలు కోరుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Akhanda 2 Piracy

Akhanda 2 Piracy

Akhanda 2 Piracy: బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘అఖండ 2’ సినిమాకు భారీ షాక్ తగిలింది. విడుదలైన 24 గంటల్లోనే సినిమా HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఈ వార్త బాలయ్య ఫ్యాన్స్‌కి, చిత్రబృందానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అఖండ 2 భారీ అంచనాలతో, రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఫుల్‌హౌస్‌ కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో, ఈ లీక్ వల్ల సినిమా కలెక్షన్స్ పై పెద్ద దెబ్బతగిలే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు.

లీక్ సంబంధించిన HD ప్రింట్ టెలిగ్రామ్ గ్రూపులు, పలు వెబ్‌సైట్లలో కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. పైరసీ కారణంగా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య అభిమానులు, సినిమాను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, సైబర్ క్రైమ్ విభాగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి సినిమాలను ఈ రకంగా పైరసీ చేయడం నిర్మాతలకు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని వారు అంటున్నారు.

ఇటీవలి కాలంలో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా, కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అవడం సినిమా పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడి, వందల మంది శ్రమతో రూపొందిన సినిమాలకు ఈ పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది.

సినీ పరిశ్రమ, ప్రభుత్వం ఈ సమస్యను కఠినంగా ఎదుర్కోవాలి, అలాగే అభిమానులు సినిమాను థియేటర్లలోనే చూసి, ఇండస్ట్రీకి మద్దతు ఇవ్వాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు