Baahubali the Epic: ‘బాహుబలి’ తిరిగొచ్చాడు.. అనుష్క ఎమోషనల్ పోస్ట్..!

బాహుబలి 1 & 2 సినిమాలు ఒకే భాగంగా 'బాహుబలి ది ఎపిక్' అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనుష్క తన ఆనందాన్ని, తన భావోద్వేగాన్ని పంచుకుంది. ఈసారి సినిమాను థియేటర్లో చూసి మళ్లీ ఆ మేజిక్‌ను అనుభవించాలని చెప్పింది.

New Update
Baahubali the Epic

Baahubali the Epic

Baahubali the Epic: తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే స్థాయిలో ప్రభావం చూపించిన సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అలాంటి ఈ బాహుబలి సిరీస్‌ని  మళ్లీ థియేటర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ఈ రెండు భాగాలు ఇప్పుడు ఒకే భాగంగా ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో దేవసేన పాత్ర పోషించిన అనుష్క శెట్టి తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు..

అనుష్క శెట్టి బాహుబలి చిత్రాల్లో చేసిన దేవసేన పాత్ర ఆమె కెరీర్‌లోనే ది బెస్ట్ గా నిలిచింది, భారతీయ సినిమా చరిత్రలో కూడా ఓ మైలురాయిగా నిలిచింది. అమరేంద్ర బాహుబలి భార్యగా, మహేంద్ర బాహుబలి తల్లిగా కనిపించిన అనుష్క రెండు వేరే వేరియేషన్లలో తన నటనా ప్రతిభను చూపించి, ప్రేక్షకుల మనసు గెలిచారు. ఈ పాత్రతో ఆమెకు జాతీయ స్థాయి ఫేమ్ మాత్రమే కాదు, అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది.

అప్పుడు సినిమా రిలీజ్ టైంలో తాను బిజీగా ఉండిపోయి, సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని అనుష్క చెప్పింది. “అప్పుడు ప్రమోషన్స్, షూటింగ్స్, షెడ్యూళ్లతో చాలా బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు బాహుబలి రెండూ ఒకేసారి, ఒకే భాగంగా మళ్లీ థియేటర్లలో వస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తూ ఆ అనుభూతిని పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

బాహుబలి ప్రాజెక్ట్‌పై నిర్మాత శోభు యార్లగడ్డ ముందే కొన్ని వివరాలు అనుష్కకు షేర్ చేయగా, అప్పుడే తనకి ఈ ఐడియా చాలా ఆసక్తికరంగా అనిపించిందట. “ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం బాగా కష్టపడుతున్నారు. స్క్రీన్‌పై మరోసారి కొత్త సినిమా చూస్తున్నట్టే అనిపించేలా ఈ ఎడిట్ చేసిన వెర్షన్ తయారు అవుతోంది,” అని చెప్పింది.

ఇప్పటికి వందల సార్లు చూసిన ‘బాహుబలి’ సినిమాలు, ఇప్పుడు కొత్తగా “ఒకే భాగంగా”, పెద్ద తెరపై మళ్లీ విడుదలవ్వడం ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. దేవసేన పాత్రలో అనుష్కను మళ్లీ చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది ఓ మంచి గిఫ్ట్‌ అని చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు