/rtv/media/media_files/2025/10/26/baahubali-the-epic-2025-10-26-10-07-17.jpg)
Baahubali The Epic
Baahubali The Epic: ఇండియన్ బాక్సఫీస్ ని షేక్ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన “బాహుబలి” మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. రెండు భాగాలను ఒకే సినిమాలో కలిపి రూపొందించిన “బాహుబలి: ది ఎపిక్” అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Baahubali The Epic Pre Bookings..
ఈ ప్రత్యేక వెర్షన్ విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉన్నా, ముందస్తు బుకింగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. కేవలం 24 గంటల్లోనే హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాల్లో 61 వేల టికెట్లు అమ్ముడవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న సినిమాకు ఇంత అద్భుతమైన స్పందన రావడం తెలుగు సినిమా ప్రతిష్టను చూపిస్తోంది.
ఇంకా అన్ని థియేటర్లలో బుకింగ్స్ పూర్తిగా ప్రారంభం కాలేదు. పూర్తి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో కూడా “బాహుబలి: ది ఎపిక్” పై భారీ హైప్ నెలకొంది. ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని అంచనా.
హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో టికెట్లు దొరకడం కష్టమవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా తమ పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు. ఈ కథ, యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ మరోసారి ప్రేక్షకులకు థియేటర్‌లో వావ్ అనిపించే అనుభూతి ఇవ్వబోతున్నాయి.
సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణి స్వరాలు మళ్లీ థియేటర్‌లను మార్మోగించనున్నాయి. ఈ వెర్షన్ మొత్తం రన్‌టైమ్ సుమారు 3 గంటలు 45 నిమిషాలు ఉండనుంది.
“బాహుబలి: ది ఎపిక్” కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది భారత సినిమా గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చూపించే అవకాశం. ఈ సినిమా మళ్లీ విడుదల అవుతున్నందుకు ప్రేక్షకులు, అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి, బాహుబలి మానియా మళ్లీ మొదలైంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నా, బుకింగ్స్ వేగం చూస్తుంటే అక్టోబర్ చివరి వారంలో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయనడంలో సందేహం లేదు.
Follow Us