/rtv/media/media_files/2024/11/26/d9NNOkrYR64yLpgKOYOw.jpg)
pawan kalyan
Pawan kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో పవన్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీలోని పలు అభివృద్ధి అంశాలపై మంత్రులతో చర్చలు జరిపారు. ఉదయం కేంద్ర టూరిజం శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు.
అయితే ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని ఓ బుక్ స్టోర్ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. సహజంగా పవన్ కళ్యాణ్ కి పుస్తకాలన్నా.. పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.
బుక్ స్టోర్ లో పవన్ ఏం కొన్నారు..?
అయితే ఇప్పుడు మరోసారి పుస్తకాల పై ఆయనకు ఉన్న ప్రేమ బయటపడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కాస్త ఖాళీ దొరకడంతో కన్నాఘట్ ప్రాంతంలోని ఐకానిక్ ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్, అలాగే ఖాన్ మార్కెట్ లోని ఫాకిర్చాంద్ బుక్ స్టోర్ కు వెళ్లారు. అక్కడ పలు పుస్తకాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీంతో పవన్ అక్కడ ఏం బుక్స్ కొని ఉంటారా..? అని చర్చించుకుంటున్నారుఫ్యాన్స్. పవన్ ది రిపబ్లిక్ అనే పుస్తకం కొన్నట్లు ఫొటో చూస్తే అర్థమవుతోంది.
Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan visited the iconic Oxford Bookstore in Connaught Place and Fakirchand Bookstore at Khan Market in New Delhi. His visit underscores his commitment to fostering a culture of learning and his deep admiration for… pic.twitter.com/w3yVRMsVk5
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 26, 2024
Also Read: ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి! అది చూడాలనిలేదు.. సమంత ఎమోషనల్