/rtv/media/media_files/2025/11/08/anumana-pakshi-2025-11-08-15-48-59.jpg)
Anumana Pakshi
Anumana Pakshi: డీజే టిల్లు సినిమాతో రైటర్‌గా, దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న విమల్ కృష్ణ ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కొత్త చిత్రం పేరు అనుమాన పక్షి.
ఇటీవలే ఈ సినిమా టీమ్ కశ్మీర్‌లో షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఆ ప్రాంతంలోని అందమైన లొకేషన్లలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా రాగ్ మయూర్, టీమ్ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర బృందం “జీరో అనుమానంతో కశ్మీర్ షెడ్యూల్ పూర్తి అయింది” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
Anumana Pakshi Kashmir Schedule Wrapped
Kashmir schedule wrapped #AnumanaPakshi in theatres very soon. pic.twitter.com/KQYWBUO5uj
— Telugu Film Producers Council (@tfpcin) November 8, 2025
ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఆ ఒక్కటి అడక్కు’ తర్వాత ఈ బ్యానర్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఆయన ట్యూన్స్ సినిమాకు కొత్త ఎనర్జీని ఇస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రిన్స్ సెసిల్, చరిత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సునీల్ కుమార్ నామా నిర్వర్తిస్తున్నారు.
విమల్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నందున ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. డీజే టిల్లులో ఆయన చూపిన వినూత్నమైన కథన శైలి, వినోదం అనుమాన పక్షిలో కూడా కనిపిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
చిత్ర బృందం ప్రస్తుతం చివరి షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. అన్ని పనులు పూర్తయిన తర్వాత సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి, కశ్మీర్ షెడ్యూల్ పూర్తయ్యడంతో అనుమాన పక్షి షూటింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ ఫన్ థ్రిల్లర్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా కనిపించబోయే ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us