Actor Chandrahas: నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు

నటుడు చంద్రహాస్‌పై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. సినిమా ఈవెంట్‌లో అసభ్య పదాలు వాడినట్లు ఆరోపణలతో పాటు జర్నలిస్ట్‌ను బెదిరించిన ఘటనపై జూబ్లీహిల్స్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

New Update
Actor Chandrahas

Actor Chandrahas

Actor Chandrahas: యువ నటుడు చంద్రహాస్ పై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన తన కొత్త సినిమా ‘బరబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్టేజ్‌పై అసభ్య పదాలతో ఉన్న పాట పాడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తప్పుబడుతూ సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. బహిరంగ వేదికలపై ఇలాంటి ప్రవర్తన సరికాదని ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

దీనికి రిప్లై గా చంద్రహాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జర్నలిస్ట్‌ను బెదిరించేలా వీడియో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై అశోక్ కుమార్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా చంద్రహాస్‌పై కేసు నమోదైంది.

ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ ఘటనకు సంబంధించి చంద్రహాస్‌పై BNS సెక్షన్ 296తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెండు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది.

చంద్రహాస్ ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడిగా గుర్తింపు పొందారు. ఈ ఘటనలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisment
తాజా కథనాలు