Angelina Jolie: పారిస్‌ రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఏంజెలినా జోలీ.. ‘కౌచర్‌’ ప్రీమియర్‌లో స్టైల్‌ షో!

పారిస్‌లో జరిగిన ‘కౌచర్‌’ ప్రీమియర్‌లో ఏంజెలినా జోలీ షియర్‌ డ్రెస్‌లో మెరిశారు. రెడ్‌కార్పెట్‌పై ఆమె స్టైల్‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో తన పాత్ర ఎంతో వ్యక్తిగతమని, ఈ ప్రాజెక్ట్‌ తనకు ప్రత్యేకమని జోలీ తెలిపారు.

New Update
Angelina Jolie

Angelina Jolie

Angelina Jolie: హాలీవుడ్‌ స్టార్‌ ఏంజెలినా జోలీ పారిస్‌లో జరిగిన ‘కౌచర్‌’ సినిమా ప్రీమియర్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో ఆమె రెడ్‌కార్పెట్‌పై అడుగుపెట్టగానే కెమెరాలు అన్నీ ఆమె వైపే తిరిగాయి. ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెప్పే లుక్‌తో జోలీ ప్రత్యేకంగా నిలిచారు.

ఈ ఈవెంట్‌కు ఆమె వెండి రంగు డ్రెస్‌తో పాటు పెద్ద కేప్‌ కోట్‌ ధరించి వచ్చారు. కార్‌ నుంచి దిగిన వెంటనే ఫోటోగ్రాఫర్లు ఆమెను క్లిక్‌మనిపించేందుకు పోటీ పడ్డారు. తర్వాత తన సహనటులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అభిమానులను కలుసుకుంటూ చేతులు కలిపి, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చారు.

Couture Movie Trailer 

రెడ్‌కార్పెట్‌పైకి వెళ్లే ముందు జోలీ తన కోట్‌ను తొలగించి, లోపల ఉన్న షియర్‌ డ్రెస్‌తో నడిచారు. న్యూడ్‌ డ్రెస్‌ ట్రెండ్‌ను ఎంతో అందంగా చూపిస్తూ, వెండి డిజైన్‌తో ఉన్న ఆ డ్రెస్‌ ఆమెకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. డ్రెస్‌ ద్వారా ఆమె టాటూలు కూడా కనిపించాయి. జుట్టును సింపుల్‌ వేవ్స్‌గా ఉంచి, మొత్తం లుక్‌ డ్రెస్‌కే హైలైట్‌గా మారేలా చేశారు.

ప్రీమియర్‌ సందర్భంగా ఏంజెలినా జోలీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైన అనుభవమని చెప్పారు. “నా ఫ్రెంచ్‌ ఇంకా బాగా రాదు, కానీ సినిమాలో నేను ఎలా చేశానో మీరు చూస్తారు” అని నవ్వుతూ చెప్పారు. దర్శకురాలు తన జీవితాన్ని, ఆలోచనలను మాతో పంచుకున్న తీరు ఎంతో బాగా అనిపించిందని ఆమె అన్నారు.

తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తనకు చాలా వ్యక్తిగతమైన పాత్ర అని జోలీ వెల్లడించారు. ఆ పాత్రలో నటిస్తూ ఎమోషన్స్ బయటపెట్టడం తనకు బాగా అనిపించిందని చెప్పారు.

‘కౌచర్‌’ సినిమాలో జోలీ మాక్సిన్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఒక ఫిల్మ్‌మేకర్‌. పారిస్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో పనిచేస్తూ, విడాకులు, టీనేజ్‌ కూతురి బాధ్యతలు, ఒక పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటూ సాగే కథ ఇది. ఈ పాత్రతో జోలీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు