నటి ఆండ్రియా జెర్మియా తమిళ్, తెలుగు, హిందీలో నటిగా, సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆండ్రియా తెలుగులో తడాఖా సినిమాలో సునీల్ జోడీగా, ఇటీవలే వెంకటేష్ 'సైంధవ్' సినిమాల్లో నటించింది. Image Credits: Andrea Jeremiah/Instagram
తెలుగులో బొమ్మరిల్లు సినిమాలో "We Have a Romeo", దడ సినిమాలో 'దీవాళీ దీపాన్ని' , భరత్ అనే నేను సినిమాలో 'ఇది కలలా ఉన్నదే' వంటి పాపులర్ సాంగ్స్ పాడింది ఆండ్రియా. Image Credits: Andrea Jeremiah/Instagram
ఇలా సింగర్ గా, నటిగా కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న ఈ నటి కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉండడం అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలకు తెరలేపింది. ఆమె సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏదైనా ప్రేమ వ్యవహారమా..? లేదా బ్రేకపా..? అంటూ రూమర్స్ మొదలయాయ్యి. Image Credits: Andrea Jeremiah/Instagram
ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా ఈ పుకార్లకు చెక్ పెట్టింది. తాను సినిమాల్లో కనిపించకపోవడానికి గల కారణాన్ని బయట పెట్టింది. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. Image Credits: Andrea Jeremiah/Instagram
ఆండ్రియా తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ అనే వ్యాధి ఉన్నట్లు చెప్పింది. ఈ వ్యాధి రావడంతో క్రమంగా కనుబొమ్మలు, వెంట్రుకలు తెల్లగా మారడం ప్రారంభించాయని తెలిపింది. ఈ వ్యాధిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని చెప్పింది ఆండ్రియా. Image Credits: Andrea Jeremiah/Instagram
ఈ సమస్య కారణంగానే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. ఇంతలో లవ్ బ్రేకప్ అంటూ వార్తలు వచ్చాయని తెలిపింది. మానసిక ఒత్తిడే దీనికి కారణమని కూడా చెప్పింది. Image Credits: Andrea Jeremiah/Instagram
ఈ వ్యాధికి సంబంధించిన అనేక మచ్చలు తన శరీరం పై ఇప్పటికీ ఉన్నాయని.. కనురెప్పలు కూడా ఇంకా తెల్లగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తనకు చాలా సహాయపడిందని చెప్పింది. Image Credits: Andrea Jeremiah/Instagram