Sudheer- Rashmi: బుల్లితెర పై బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడి ఎవరనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే జంట సుడిగాలి సుధీర్- రష్మీ. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జోడీని చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. మొదట్లో స్క్రీన్ పై వీళ్ళ బాండింగ్ చూసి.. వీరిద్దరి మధ్య ఏదైనా ఉందా..? లేదా టీఆర్ఫీ కోసం అలా నటిస్తున్నారా? అనే కన్ఫ్యూజన్ చాలా కాలం కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని తెలిసింది. అయినప్పటికీ ఏదైనా షోలో వీరిద్దరూ జోడీగా కనిపిస్తే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సుధీర్- రష్మీ జంట బుల్లితెర పై హిట్ పెయిర్ అన్నట్లుగా నిలిచింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత వీరిద్దరి కాంబోలో ఎలాంటి షోలు రాకపోవడంతో ఈ జోడీని ప్రేక్షకులు తెగ మిస్ అయ్యారు. ఇద్దరు కలిసి మళ్ళీ షో చేస్తే బాగుంటుందని కామెంట్లు కూడా పెట్టారు. ఈ క్రమంలో తాజాగా సుధీర్- రష్మీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
రష్మీ- సుధీర్ ఫోన్ కాల్
శ్రీదేవి డ్రామా తాజాగా దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఒక టాస్క్ లో భాగంగా రష్మిని.. సుధీర్ కి ఫోన్ చేసి అర్జంట్ గా రూ.10 వేలు పంపమని అడగాలని చెప్తారు. దీంతో రష్మీ సుధీర్ కి ఫోన్ చేసి.. ''హాయ్ బేబ్ అర్జంట్ గా రూ.10 వేలు కావాలని అడుగుతుంది'. ఇక సుధీర్.. రష్మీ ఫోన్ కట్ చేసే లోపు ఆమెకు అమౌంట్ ను సుధీర్ పంపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆన్ స్క్రీన్ పై మాత్రమే కాదు రియల్ లైఫ్ లోనూ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని అర్థమైంది. ఇక సుధీర్- రష్మీ ఫ్యాన్స్ ఈ ప్రోమో కట్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Also Read: హరితేజ VS పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ నామినేషన్ గోల.. బుక్కైన అవినాష్..!