ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ లాక్మే ఫ్యాషన్ వీక్ X FDCI 2024 గ్రాండ్ ఫినాలేలో తన డిజైనర్ దుస్తువులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రోహిత్ బాల్ డిజైన్ చేసిన లెహంగాలో అబ్బురపరిచింది.
అనన్య క్లాసీ స్టైల్, కాన్ఫిడెన్స్ ఈవెంట్కు ఆకర్షణను జోడించాయి. తన అందచందాలతో అనన్య అందరినీ ఫిదా చేసింది. ఈ ఫ్యాషన్ వీక్ లో శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్ తదితరులు కూడా తమ అందాలతో ఫిదా చేశారు.
అనన్య ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో మెరిసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొతం చేసుకుంది.
తాజాగా అనన్య నటించిన 'CTRL' నేరుగా ఓటీటీలో విడుదలైంది. స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
Image Credits: Ananya Panday/ Instagram