/rtv/media/media_files/2024/10/28/f8tn1W8eJ45aG8igp7ex.jpg)
duet
DUET: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ. 'బేబీ' సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే 'గం, గం గణేశా' సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.
'డ్యూయెట్'
ప్రస్తుతం ఆనంద్ 'డ్యూయెట్' మరో సరి కొత్త లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జ్ఞానవేల్ రాజా, స్టూడియో గ్రీన్ బ్యానర్స్, మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రాన్ని మిథున్ వరదరాజ కృష్ణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ రితిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పెళ్లి కూతురు గెటప్ లో.. చేతిలో సిగరెట్ పట్టుకున్న రితికా లుక్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా త్వరలోనే హీరో ఫస్ట్ లుక్ కూడా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read:దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి
ఇది ఇలా ఉంటే ఇటీవలే జరిగిన సైమా అవార్డ్స్ లో 'బేబీ' చిత్రానికి ఉత్తమ డెబ్యూ చిత్రంగా అవార్డు లభించింది. అలాగే నటీ నటులు ఆనంద్, వైష్ణవికి కూడా అవార్డులు లభించాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ లవ్ స్టోరీగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. SKN నిర్మించిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ తెరకెక్కించారు.
Introducing The Beautiful & Talented @RiktikaNayak_ As EESHA ❤️🔥
— Official Srinu (@OfficialSreeNu) October 27, 2024
Team #DUET Wishes Her A Fabulous Birthday! ❤️#HBDRitikaNayak ✨
First Look Dropping Soon! 🤩@StudioGreen2@GnanavelrajaKe@madhurasreedhar#AnandDeverakonda@RitikaNayak_@gvprakash@mithukrish12pic.twitter.com/Rjrcf6h4up
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా