/rtv/media/media_files/2025/11/21/allu-arha-2025-11-21-21-01-05.jpg)
Allu Arha
Allu Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇంట్లో ఇవాళ ప్రత్యేకమైన సందడి జరిగింది. ఆయన కూతురు అల్లు అర్హ నవంబర్ 21న తన 9వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియాలో అర్హతో ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు.
Allu Arha 9th Birthday Celebration
Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe
— Allu Arjun (@alluarjun) November 21, 2025
ఈ పిక్ అల్లు సిరీష్ నిశ్చితార్థ వేడుకలో తీసుకున్నదే. బన్నీ తెలుపు కుర్తా-పజామా, నెహ్రూ జాకెట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా, అర్హ పింక్ లెహంగా లో చాలా క్యూట్‌గా కనిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతున్న ఆ క్షణం అభిమానులను ఆకట్టుకుంది.
స్నేహా రెడ్డి స్పెషల్ పోస్ట్..
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా అర్హ కోసం ఒక మధురమైన బర్త్‌డే విష్ పెట్టారు. అబుదాబీ ట్రిప్‌లో తీసుకున్న అమ్మ-కూతురు ఫోటోను షేర్ చేస్తూ
“Happy Birthday to my baby” అని పోస్ట్ చేసారు.
అల్లు అర్జున్ రాబోయే సినిమాలు
అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ చూస్తే, వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. Atlee దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ AA22xA6 షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో బన్నీ ఓ పెద్ద ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు - ఒకే సినిమాలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు అంటే మొత్తం నాలుగు పాత్రలు చేయనున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకోన్, జాన్వి కపూర్, రష్మిక మందన్న, మృణాల్ వంటి ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్. అలాగే రమ్యకృష్ణను కూడా కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఇవి కాకుండా, అభిమానులు ఎదురుచూస్తున్న పుష్ప 3 కూడా త్వరలో పట్టాలెక్కనుంది. అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్-ఇండియా సోషియో-మైతలాజికల్ ఫాంటసీ సినిమా కూడా లైన్లో ఉంది.
మొత్తం మీద, అర్హ పుట్టినరోజు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీ తన కూతురిపై చూపుతున్న ప్రేమను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కుటుంబంతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తూనే, సినిమాలతో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Follow Us