టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు ఫ్యాన్స్ నుంచి అర్హకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెష్ వెలువెత్తుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురికి స్పెషల్ విషెష్ తెలియజేశారు. కూతురి తన ప్రేమను చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
"నా జీవితంలో అందమైన ఆనందానికి జన్మదిన శుభాకాంక్షలు.. నా లిటిల్ అర్హా 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం. నీ ప్రెజెన్స్ నా జీవితాన్ని చాలా మధురమైనదిగా చేసింది. లాట్స్ ఆఫ్ లవ్ నాన్న" అంటూ పోస్ట్ పెట్టారు బన్నీ.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, పలువురు సెలెబ్రెటీలు కూడా అర్హాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డి అప్పుడప్పుడు అర్హకు సంబంధించిన క్యూట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వీటిలో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో అభిమానులను ఫిదా చేస్తుంటుంది.
బన్నీకి మాత్రమే కాదు సోషల్ మీడియాలో అర్హాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. అర్హాకు సంబంధించి ఏ చిన్న వీడియో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.
పలు షోస్, ఈవెంట్స్ లలో కూడా అర్హ చలాకీగా కనిపిస్తుంది. ఇటీవలే బాలయ్య అన్స్టాపబుల్ షోలో తెలుగు పద్యం ఆపకుండా పాడగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఇప్పటికే అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసింది. సమంత 'శాకుంతలం' అర్హ భరతుడు పాత్రలో కనిపించి అచ్చమైన తెలుగులో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.