Alcohol Teaser: అల్లరి నరేష్ 'ఆల్కహాల్' టీజర్ వచ్చేసింది.. ఇక్కడ చూడండి

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆల్కహాల్' టీజర్ విడుదల చేశారు మేకర్స్.  గ్లాస్ లో మందు, ఐస్ ముక్కలతో ప్రారంభమైన ఈ  టీజర్ ఆసక్తికరంగా సాగింది. కమెడియన్ సత్య- అల్లరినరేష్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

New Update

Alcohol Teaser: అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆల్కహాల్' టీజర్ విడుదల చేశారు మేకర్స్.  గ్లాస్ లో మందు, ఐస్ ముక్కలతో ప్రారంభమైన ఈ  టీజర్ ఆసక్తికరంగా సాగింది. కమెడియన్ సత్య- అల్లరినరేష్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆల్కహాల్ కి అల్లరి నరేష్ కి సంబంధం ఏంటి? అనే అంశాలు ఆసక్తిని పెంచాయి. 

టీజర్ చూస్తుంటే.. ఒక వ్యక్తి జీవితం పై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశం చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. ఆల్కహాల్ తాగకముందు, తాగిన తర్వాత హీరో ఆలోచనలు,ప్రవర్తన ఎలా మారిపోతాయో, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపించనున్నారు. మెహర్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ , నిహారిక కథనాయికలుగా నటించగా.. సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మెహర్ తేజ గతంలో ఫ్యామిలీ డ్రామా చిత్రం తీశారు. ఈ సినిమా ప్రేక్షకులు , విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. కథంశానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నతమైన టెక్నీకల్ వ్యాల్యూస్ తో సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. చైతన్య భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. 

మొన్నటి వరకు కామెడీ చిత్రాలతో అలరించిన.. కొంత కాలంగా కొత్త రకమైన కథలను, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'ఆల్కహాల్' సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదొక థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో నరేష్ తనలో మునుపెన్నడు చూడని డార్క్ షేడ్స్‌ని చూపించబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

2021 లో విడుదలైన 'నాందీ ' సినిమతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత బచ్చలమల్లి, ఉగ్రం, ఆ ఒక్కటి అడక్కు వంటి డిఫరెంట్ కథలతో అలరిస్తూ వస్తున్నారు. శంభో శివ శంభో, తొట్టి గ్యాంగ్, కితకితలు, కెవ్వు కేక,  యముడికి మొగుడు, గమ్యం, సుడిగాడు, మహర్షి, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు ఆర్ఎంపీ, దొంగల బండి, ఆహా నా పెళ్లంట, సీమ టపాకాయ వంటి సినిమాలతో నరేష్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలతో అప్పట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నరేష్. హీరోగా మాత్రమే కాదు ఈవీవీ బ్యానర్ పై పలు సినిమాాలు నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు