/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-five-2025-09-06-18-01-20.jpg)
హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-four-2025-09-06-18-01-20.jpg)
'కామెడీ గోస్ కాస్మిక్' అనే ట్యాగ్ లైన్ తో దీనిని అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో ఇందులో కామెడీతో పాటు ఫాంటసీ అంశాలు కూడా ఉంటాయని చిత్రబృందం వెల్లడించింది
/rtv/media/media_files/2025/09/06/naresh-65-pic-one-2025-09-06-18-01-20.jpg)
ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా, ప్రముఖ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు.
/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-two-2025-09-06-18-01-20.jpg)
వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల వంటి దర్శకులు స్క్రిప్ట్‌ను అందజేశారు.
/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-three-2025-09-06-18-01-20.jpg)
ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-six-2025-09-06-18-01-20.jpg)
అయితే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి స్టార్ కమెడియన్స్ కీలక పాత్రల్లో నటించడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. వీరి కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
/rtv/media/media_files/2025/09/06/naresh65-pic-two-2025-09-06-18-01-20.jpg)
ప్రస్తుతం నరేష్ 'ఆల్కహాల్' సినిమాతో బిజీగా ఉండగా.. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది అల్లరి నరేష్ కెరీర్ లో మరో మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.