దసరా కానుకగా ఓటీటీలో అక్ష‌య్ కుమార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?

అక్షయ్ కుమార్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఖేల్ ఖేల్ మే'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 09 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

New Update

Khel Khel mien ott: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ  ‘ఖేల్ ఖేల్ మే'. ఆగస్టు 15 న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని 2016లో వ‌చ్చిన ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్‌గా రూపొందించారు.  ఈ మూవీకి  ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించగా.. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ  చిత్రంలో అమ్మీ విర్క్, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సీల్,   ప్రగ్యా జైస్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మూవీ స్టోరీ 

ఈ సినిమా ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో వాళ్ళు ఒక గేమ్ ఆడతారు. అందరు ఫోన్స్ అన్ లాక్ చేసి తమ ఫోన్ లో ఏం సీక్రెట్స్ ఉన్నాయో చూపించడమే గేమ్. ఈ గేమ్ వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? అనేదే ఈ సినిమా స్టోరీ. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు