Adivi Sesh Upcoming Movies: టాలీవుడ్ లో సరికొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ హంగుల దూరంగా ఉండే ఈ నటుడు, ఎంచుకునే ప్రతి సినిమా కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ‘క్షణం’ మూవీతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న శేష్, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో హిట్ మ్యషీన్‌గా మారిపోయారు.
ఇక ఇటీవల తాను నటించిన సినిమాల విడుదలల మధ్య గ్యాప్ ఎక్కువవుతోందని, దానిని తగ్గిస్తానని స్వయంగా హామీ ఇచ్చిన శేష్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి - ఒకటి ‘డెకాయిట్’, మరొకటి భారీ అంచనాలతో రూపొందుతున్న ‘గూఢచారి 2’.
ముందుగా ‘డెకాయిట్’ రిలీజ్?
సినీ వర్గాల సమాచారం ప్రకారం, అడివి శేష్ ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాను ముందుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఫేమస్ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొదట ఈ సినిమాలో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. స్టైలిష్ యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ఈ చిత్రం శేష్ కెరీర్‌లో మరో స్పెషల్ ప్రాజెక్ట్ కానుంది.
భారీ స్థాయిలో ‘గూఢచారి 2’
అడివి శేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ‘గూఢచారి’. చిన్న బడ్జెట్‌తో రూపొందినా, సినిమా విజయవంతం కావడంతో దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి టాప్ బ్యానర్ల కలయికలో ఈ చిత్రం నిర్మితమవుతుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ స్పై థ్రిల్లర్‌ను రూపుదిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని 2026 ప్రారంభంలో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
రెండు సినిమాలు - రెండు విభిన్నమైన ప్రయోగాలు
ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌లతో రూపొందుతున్నాయి. ఒకవైపు అడివి శేష్‌ను మాస్ ఆడియెన్స్‌కు దగ్గర చేసే ‘డెకాయిట్’, మరోవైపు ఇంటెలిజెన్స్, యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా ఉండబోయే ‘గూఢచారి 2’. ఈ సినిమాల ద్వారా శేష్ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. 2025లో 'డెకాయిట్', ఆ తర్వాత 'గూఢచారి 2' రిలీజ్‌తో శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కట్టాలనుకుంటున్నాడు. అభిమానులు మాత్రం ఈ యంగ్ టాలెంటెడ్ హీరో నుంచి సర్ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు!