తెలంగాణ యాస, కట్టు, బొట్టుతో వార్తలు చదువుతూ.. సావిత్రక్కగా ప్రేక్షకులకు దగ్గరైంది యాంకర్ శివజ్యోతి. అదే ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
సీజన్ 4లో తన ఆట, మాటతో మెప్పించిన జ్యోతక్క టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె పాపులారిటీ మరింత పెరిగింది. వరుస షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉంది.
ఓ వైపు షోలలో సందడి చేస్తూనే.. తన యూట్యూబ్ ఛానెల్ తోనూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది.
తాజాగా తన భర్త గంగూలీతో కలిసి అరుణాచలం శ్రీవారిని దర్శించుకున్న శివజ్యోతి... అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒక న్యూస్ యాంకర్ గా జర్నీ స్టార్ట్ చేసిన శివజ్యోతి.. ఆపై సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకొని వ్లాగ్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
శివజ్యోతికి యూట్యూబ్, ఇన్స్టా లో 1 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె పుట్టిపెరిగింది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో.
జ్యోతక్క తన భర్త గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు శివజ్యోతి ఓ షోలో తెలిపింది.
Image Credits: Shiva Jyothi/Instagram