/rtv/media/media_files/KGrH6qVO0DKxM8Xtg1Wx.jpg)
భీమ్లా నాయక్, విరూపాక్ష, సార్ సినిమాలతో తెలుగులో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళ కుట్టి సంయుక్త వరుస చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది.
/rtv/media/media_files/8Dj8BZcHZ8PJSFXLju5D.jpg)
ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన పాన్ ఇండియా ఫిల్మ్ స్వయంభు చేస్తుంది. ఇక ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. సరికొత్తగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
/rtv/media/media_files/samyuktha-5.jpeg)
సంయుక్త లీడ్ రోల్లో న్యూ ఏజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని నేడు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో రానా దగ్గుబాటి హాజరయ్యారు. నిర్మాతలు దిల్ రాజు, కోనా వెంకట్, సురేష్ బాబు తదితరులు కూడా పాల్గొన్నారు.
/rtv/media/media_files/62vDbeyP5DbTM0qjXCxm.jpg)
హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి యోగేశ్ దర్శకత్వం వహించనున్నారు. సినిమాకు రానా క్లాప్ నివ్వగా.. నిర్మాతలు దిల్ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
/rtv/media/media_files/samyuktha-4.jpeg)
ఈ సందర్భంగా నటి సంయుక్త మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు తాను తెలుగులో చేసిన అన్ని చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయని. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో మీ ముందుకు రాబోతున్నానని.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.
/rtv/media/media_files/gVOXIg6DlFoB14ULgTxz.jpeg)
Image Credits: Hasya Movies, samyuktha/ Instagram