కర్వా చౌత్ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. కర్వా చౌత్ వేడుకను జరుపుకునే సంప్రదాయం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపిస్తుంది.
ఈ సంవత్సరం కర్వా చౌత్ ఉత్సవాలు అక్టోబర్ 20న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ తన కర్వా చౌత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. పెళ్ళైన తర్వాత తొలి కర్వా చౌత్ వేడుకను జరుపుకుంది.
కర్వా చౌత్ రోజున మహిళలు ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఏమీ తినకుండా, త్రాగకుండా ఉపవాసం ఉంటారు. సాయంకాలం చంద్రుని దర్శనం తర్వాత భర్త మొహాన్ని జల్లెడలో చూసి.. భర్త చేతుల మీదుగా స్త్రీలు ఉపవాసాన్ని విరమిస్తారు.
రకుల్ ఉపవాసం తర్వాత జల్లెడలో తన భర్త మొహాన్ని చూస్తూ సంతోషంగా కనిపించింది. ఈ పిక్స్ షేర్ చేస్తూ రకుల్ ఇలా రాసింది.. ''నా సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నా ప్రతిదీ'' అంటూ భర్తతో జాకీతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
జాకీ భగ్నానిని , రకుల్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం గోవాలో జరిగింది. పెళ్ళైన తర్వాత మొదటి కర్వా చౌత్ వేడుక కావడంతో రకుల్ చాలా స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే రకుల్ వర్కౌట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడింది. 80 కేజీల బరువును డెడ్‌లిఫ్ట్ చేస్తున్న నడుముకు సంబంధించిన సమస్య ఏర్పడింది. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండడంతో ఆమెను వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.