స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్ తో దీపావళి పండగను గ్రాండ్ గా జరుపుకున్నారు. పండగ సందర్భంగా ప్రియాంక, నిక్ ఫ్రెండ్స్ కోసం బుధవారం స్పెషల్ పార్టీ హోస్ట్ చేశారు.
ఈ పార్టీలో హాలీవుడ్ స్టార్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు పాల్గొన్నారు. ప్రియాంక లండన్ లోని జింఖానా రెస్టారెంట్లో ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీలో ప్రియాంక సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందంగా మెరిసింది. సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ శారీలో ఎంతో అందంగా కనిపించారు.
డీప్ నెక్లైన్తో కూడిన బ్లౌజ్, ఎర్రటి బిందీ, బ్యాంగిల్స్తో తన పండుగ రూపాన్ని హాలైట్ చేసింది ప్రియాంక.
ప్రియాంక భర్త నిక్ కూడా సంప్రదాయ కుర్తాలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను ప్రియాంక ఫ్యాన్ పేజ్ కు సంబంధించిన అభిమానులు పంచుకున్నారు. ll Image Credits: jerryxmimi/Instagram