శనివారం సాయంత్రం ముంబై వేదికగా హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024 వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ 18 మంది మహిళలు సూపర్ అచీవర్ల గా వివిధ క్యాటగిరీల్లో అవార్డులు అందుకున్నారు. ప్రతి అవార్డు విజేతను వేదికపై సత్కరించారు.
హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసింది. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో అన్నయ గ్లామరస్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఈవెంట్ లో అన్నయ 'స్పాట్లైట్ యాక్టర్' అవార్డుకు దక్కించుకుంది.
అనన్య తో పాటు అంబానీ కూతురు ఈషా అంబానీ, బాలీవుడ్ బ్యూటీస్ అనన్య పాండే, కృతి సనన్, డైరెక్టర్ పాయల్ కపాడియా పలువురు సెలెబ్రెటీలు పాల్గొన్నారు.
అనన్య క్లాసీ స్టైల్, కాన్ఫిడెన్స్ ఈవెంట్కు ఆకర్షణను జోడించాయి. తన అందచందాలతో అనన్య అందరినీ ఆకట్టుకుంది. అనన్య స్టైలిష్ ఫ్యాషన్ లుక్స్ మీరు కూడా చూసేయండి.
అనన్య ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన 'ఖేల్ ఖేల్ మే' మూవీలో మెరిసింది. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అనన్య విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇటీవలే అనన్య నటించిన 'CTRL' నేరుగా ఓటీటీలో విడుదలైంది. స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.