/rtv/media/media_files/2025/09/20/28-yeras-later-2025-09-20-13-37-13.jpg)
28 Yeras Later OTT
28 Yeras Later OTT:
ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ మూవీ "28 Yeras Later" ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు Rental మోడ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సినిమా ఓ పోస్ట్-అపోకలిప్టిక్ హారర్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు డ్యానీ బోయిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2002లో వచ్చిన "28 డేస్ లేటర్", 2007లో వచ్చిన "28 వీక్స్ లేటర్" తర్వాత వచ్చిన మూడో పార్ట్ ఇది. దుమ్ము దులిపిన ఈ ఫ్రాంచైజీకి ఇది కొనసాగింపు కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
అమెరికా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ మూవీ, $60 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కి $151 మిలియన్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. టెన్షన్, ఎమోషన్, హారర్ మూడింటి కలిపి కథను ఆసక్తికరంగా నడిపించడంతో, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.
ఇక ఇందులో ప్రముఖ నటీనటులు జోడీ కోమర్, ఆరోన్ టేలర్ జాన్సన్, ఆల్ఫీ విలియమ్స్, రాల్ఫ్ ఫైన్స్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయగా, కలంబియా పిక్చర్స్, డెసిబెల్ ఫిలిమ్స్, డిఎన్ఏ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.
మొదట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, బుక్ మై షో స్ట్రీమ్, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల్లో రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా స్ట్రీమింగ్‌లో ఉంది.
Follow Us