/rtv/media/media_files/2026/02/14/100-days-love-story-2026-02-14-14-40-56.jpg)
100 Days Love Story
100 Days Love Story: ప్రేమ కథలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. అదే ప్రేమలో కొత్త భావాన్ని చూపిస్తే మరింతగా ఆకట్టుకుంటుంది. అలాంటి కొత్త కథతో వస్తున్న సినిమా ‘100 డేస్ లవ్ స్టోరీ’. జయ శివ సూర్య(Jaya Shiva Surya), నిఖిత శ్రీ, ఇషా మనోహరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు విజయమిత్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పురిపండా వెంకటరమణ మూర్తి శర్మ నిర్మిస్తున్నారు. నిర్మాణం ‘శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్’ బ్యానర్‌పై జరిగింది.
100 Days Love Story Trailer
ఈ సినిమాకు ‘అతి ప్రేమ భయానకం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే ప్రేమ ఎక్కువైతే అది భయంకరంగా మారుతుందనే భావంతో కథ సాగుతుంది. యూత్‌కు నచ్చే విధంగా, భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తమ సినిమా ప్రేమ కథల్లో కొత్త రకం అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు కథను చాలా బాగా తీసుకువచ్చారని, హీరో హీరోయిన్ల నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
‘అతి ప్రేమ భయానకం’ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ‘100 డేస్ లవ్ స్టోరీ’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow Us