Babu Mohan: బీజేపీ బాబుమోహన్ బై బై.. కిషన్‌రెడ్డి వల్లే..! సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు తన రాజీనామ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపుతానని తెలిపారు. కిషన్‌రెడ్డి వల్లే పార్టీ వీడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Trinath 07 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Babu Mohan Quits BJP: తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరమన్నారు బాబు మోహన్. పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలోతగిన ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాబుమోహన్ రాజీనామా చేయనున్నారు. రేపు(ఫిబ్రవరి 7) రాజీనామా లేఖను పంపుతానన్నారు. వరంగల్ జిల్లా ఎంపీగా (Warangal MP) పోటీ చేస్తానని బాబు మోహన్ తెలిపారు. కిషన్‌రెడ్డి (Kishan Reddy) వల్లే పార్టీ వీడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు మోహన్. ఫోన్ కూడా ఎత్తడంలేదు: బీజేపీ పార్టీ (BJP Party) కోసం తాను చాలా కష్టపడ్డానన్నారు బాబుమోహన్. ఏ,బీ,సీ,డీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా తనని డీ క్యాటగిరిగా నిర్ణయించడానికి పార్టీ సీనియర్లకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేసిన తనని డీ క్యాటగిరిలో ఎలా పెడతారని నిలదీశారు. సరాసరి తనని అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని అర్థమైందన్నారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి తనను దూరం పెడుతూ తన ఫోన్ కూడా ఎత్తకుండా బీజేపీ దద్దమ్మ సన్నాసి నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల! WATCH: #babu-mohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి