CIL Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే! కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి 561 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 లాస్ట్ డేట్. అధికారిక వెబ్ సైట్: https://www.coalindia.in/. By Nikhil 20 Sep 2023 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి CIL Recruitment 2023: ఇంజినీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారా? మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకో శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CIL Notification) విడుదల చేసింది సంస్థ. మొత్తం 560 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13న ప్రారంభించింది కోల్ ఇండియా. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: - మైనింగ్ : 351 - సివిల్ : 172 - జియాలజీ : 37 మొత్తం: 560 విద్యార్హతల వివరాలు: మైనింగ్: అభ్యర్థులకు మైనింగ్ ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. సివిల్: సివిల్ ఇంజనీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జియాలజీ: జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ\ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. - ఈ విద్యార్హతలతో పాటు గేట్-2023లో (GATE-2023) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయో పరిమితి: అభ్యర్థులు ఆగస్టు 1 నాటికి 30 ఏళ్లను మించకూడదు. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. -ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రూ.1180ని అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు అధికారులు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా అప్లై చేయాలంటే? - అభ్యర్థులు మొదటగా https://www.coalindia.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. - అనంతం Career with CIL ఆప్షన్ పై క్లిక్ చేయాలి. - తర్వాత Jobs at Coal India విభాగాన్ని ఎంచుకోవాలి. మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ను పూర్తి చేయాలి. అభ్యర్థుల ఎంపిక: అభ్యర్థుల గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Also Read: దేశసేవ చేయాలనుకునేవారికి శుభవార్త…ఆర్మీలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..!! #rtv-live-telugu #central-government-jobs #cil-recruitment-2023 #coal-india-limited-recruitment-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి