Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కస్టడీ విచారణ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టారు.

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
New Update

Chandrababu: రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కస్టడీ విచారణ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టారు. కోర్ట్ ఆదేశాలు అమలు చేసారా? ఇంటి ఆహరం ఇచ్చారా? మీ మీద థర్డ్ డిగ్రీ లాంటి ఏమైనా చేసారా అని జడ్జి అడిగారు. అనంతరం రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

విచారణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విచారణలో భాగంగా చంద్రబాబు నుంచి అధికారులు స్కీల్ స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించించినట్లు సమాచారం.  సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు.

మరోవైపు ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు. నిన్ననే కస్టడీ ఆదేశాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. అయితే.. నేటితో చంద్రబాబు కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ రేపు విచారణకు వస్తే ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

#ap-cid #chandrababu-arrest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe