రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో సీఐడీ అధికారులు చంద్రబాబుని ఈ రోజు, రేపు విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యహ్నం 1 గంటలకు ముగిసింది. ఉదయం 9.45 గంటలకు సీఐడీ అధికారులు లోనికి వెళ్లగా.. 10 గంటలకు విచారణ ప్రారంభించారు. మొత్తం మూడు గంటల పాటు విచారణ సాగింది. ఒంటి గంటల నుంచి 2 గంటల వరకు.. అంటే గంట పాటు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ సమయంలో ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని చేయనున్నారు చంద్రబాబు. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ విచరాణ కొనసాగనుంది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. స్కిల్ డవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు చంద్రబాబు తరఫు లాయర్లు పిటీషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు తుది దశలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో చంద్రబాబు తరఫు లాయర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు తప్పక ఊరట లభిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒక వేళ సుప్రీం కోర్టులోనూ ఊరట లభించకపోతే చంద్రబాబు మరికొన్ని రోజులు జైలులోనే ఉండాల్సి వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Judge Hima Bindu: ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్.. చర్యలకు కీలక ఆదేశాలు