AP: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.. లేదంటే ఇలా జరుగుతుంది: సిఐ రాజేష్

ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయిందని అన్నారు జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్. ప్లాస్టిక్.. పర్యావరణాన్ని పాడు చేస్తుందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాగితంతో తయారు చేసిన వస్తువులను వాడాలని ప్రజలకు సూచించారు.

New Update
AP: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.. లేదంటే ఇలా జరుగుతుంది: సిఐ రాజేష్

West Godavari: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రపంచ బ్యాగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కాగితంతో తయారుచేసిన బ్యాగులను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బస్టాండ్ లోని ప్రయాణికులకు ఉచితంగా అందజేశారు.

Also Read: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ సునీల్ హెచ్చరిక..!

ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయిందని అన్నారు. దానివలన భూతాపం పెరిగిపోయి సరైన కాలంలో వర్షాలు పడక చాలా ఇబ్బందులు పడుతామన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితం లేదా నారతో తయారు చేసిన వస్తువులు ఉపయోగించాలని కోరారు. కాగితం భూమిలో త్వరగా కరిగిపోతుందని, ప్లాస్టిక్ నేలను పర్యావరణాన్ని పాడు చేస్తుందన్నారు. ప్రజలు.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు