జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఓ చెత్తనా.. వాడికి రెండు పెళ్లిళ్లు.. శ్రీశైలం యాదవ్ సంచలన ఇంటర్వ్యూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను టార్గెట్ చేస్తూ చిన్న శ్రీశైలం యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపించారు. ఎన్నికల తర్వాత మాగంటిని జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. By Nikhil 14 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చెత్తనా కొడుకంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్న శ్రీశైలం యాదవ్. ఆర్టీవీతో ఆయన మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) ఎన్నికల అఫిడావిట్ లో అంతా తప్పుడు సమాచారం ఇచ్చాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆయనను ఖాయంగా ఇంటికి పంపిస్తామన్నారు. తన కుటుంబంలో కుటుంబంలో చిచ్చు పెట్టాలని మాగంటి చూశాడని ధ్వజమెత్తారు. ఆయన అన్ని బాగోతాలను ఆధారాలతో బయటపెడుతానని ప్రకటించారు. వాళ్ల అమ్మంటే గౌరవం ఉంది.. ఆమె కాళ్లు మొక్కుతానన్నారు. ప్రతీ దసరాకు మాగంటి తల్లి కాళ్లు మొక్కుతానన్నారు. కానీ జూబ్లీహిల్స్ లో మాగంటి అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: Kishan Reddy: రంగంలోకి కిషన్ రెడ్డి.. బీజేపీలోకి నవీన్ యాదవ్? తాను ఫ్లెక్సీ చింపినట్లు కేసు పెట్టాడని ధ్వజమెత్తారు. తనది ఫ్లెక్సీలు చింపే వయస్సా అని ప్రశ్నించారు. తన కుమారుడు నవీన్ పాన్ డబ్బా ఓపెన్ చేసినా.. తెల్లారే సరికి దానిని ముసివేయిస్తున్నాడని ఆరోపించారు. పేదల ఇళ్లను కూడా కూలగొట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. మాగంటి గోపినాథ్ రెండు వివాహాలు చేసుకున్నాడని.. దానికి తానే ప్రత్యక్ష సాక్షినని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీశైలం యాదవ్. ఇంకా.. డిగ్రీ చదివిన తర్వాత ఇంటర్ చదివాడని గోపినాథ్ అంటున్నాడని.. ఆ కొత్త కాలేజ్ ఎక్కడ ఉందో చెప్పాలని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ కార్పొరేటర్ ను ఇంటికి పిలిచి కొట్టిన చరిత్ర ఎమ్మెల్యేది అని అన్నారు. మాగంటి పాపం పండిందన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయనను వదిలి పెట్టేదిలేదని, జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని, అతను తనకు మిత్రుడని అన్నారు శ్రీశైలం యాదవ్. ఈ మాగంటిలాంటి చెత్తను బీఆర్ఎస్ లోకి తీసుకోకుంటే బాగుడేందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు అన్నిపార్టీల్లోనూ దోస్తులు ఉన్నారన్నారు. కొడుకుకంటే కూడా తనకు దోస్తులు ముఖ్యమన్నారు. త్వరలో మాగంటి అక్రమాలను బయట పెడతామన్నారు. #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి