"అమ్మా..చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి"..బాలల అక్రమరవాణాలో ఏపీ టాప్.!

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్నిపుర స్కరించుకుని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్, గేమ్స్ 24 సెవన్ సంస్థలు భారత్‌లో బాలల అక్రమ రవాణా సమాచార విశ్లేషణ.. పేరిట నివేదిక విడుదల చేశాయి.దేశంలో బాలల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో..ఆంధ్రప్రదేశ్ ఒకటి. కోవిడ్ ముందుతో పోలిస్తే రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా ఘటనలు చాలా ఎక్కువయ్యాయి. 2016-20 మధ్య ఏపీలో బాలల అక్రమ రవాణాకు సంబంధించి 50 ఘటనలు చోటు చేసుకోగా.. 2021-22లో ఆ సంఖ్య ఏకంగా 210కు పెరిగింది. మనతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 21 రాష్ట్రాల పరిధిలోని 262 జిల్లాల్లో చిన్నారుల అక్రమ తరలింపు కలవరపెడుతోంది. దాని ప్రకారం ఏపీలో కొవిడ్ తర్వాత అక్రమ రవాణాకు గురైన బాలల సంఖ్య సగటున 68 శాతం పెరిగిందని వివరించింది.

New Update
"అమ్మా..చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి"..బాలల అక్రమరవాణాలో ఏపీ టాప్.!

అమ్మ చెప్పే కథలు,కబుర్లు వింటూ ఆమె లాలనలో ఆదమరచి నిద్రపోయే పసితనం వారిది. నాన్న నడిపే బాటలో లోకాన్ని ఆకళింపు చేసుకునే బాల్యం వారిది. గురువులు బోధించే జ్ఞానంతో వెలిగే చిరుదివ్వెలు వారు. కానీ సమాజిక చీకటి క్రీనీడల్లో ఆ పసిమొగ్గలు వాడిపోతున్నాయ్. కొన్ని అసాంఘిక శక్తులు కాఠిన్యానికి వారి బాల్యం బలైపోతోంది.

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్నిపుర స్కరించుకుని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్, గేమ్స్ 24 సెవన్ సంస్థలు భారత్‌లో బాలల అక్రమ రవాణా సమాచార విశ్లేషణ.. పేరిట నివేదిక విడుదల చేశాయి.

దేశంలో బాలల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో..ఆంధ్రప్రదేశ్ ఒకటి. బడిలో రూపుదిద్దుకునే రేపటి జీవితం కూకటి వేళ్లతో సహా కూలిపోతోంది.అమ్మ ఒడిలోంచి అంధకారంలోనికి నెట్టివేయబడుతున్నారు.

నాన్న ధైర్యాన్ని కోల్పోయి మానవ మృగాల గుంపులోకి విసిరేయబతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొంత మంది బాలల గతం, వర్తమానం, భవిష్యత్తు..! కొంత మంది దుర్మార్గుల స్వార్ధానికి నేటి బాలలే రేపటి పౌరులన్న వాఖ్యానికి అర్థం మారిపోయింది.

ప్రతి నెలా వారి తలరాతలు మారిపోతున్నాయి. సంవత్సరంలో కొన్ని వందలు మంది చిన్నారులు రాష్ట్రాలు దాటిపోతున్నారు. బంగారం లాంటి వారి జీవితం బానిసత్వంలోకి తర్జుమా చేయబడుతుంది.

publive-image

రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా ఘటనలు కొవిడ్ ముందుతో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. 2016-20 మధ్య ఏపీలో బాలల అక్రమ రవాణాకు సంబంధించి 50 ఘటనలు చోటు చేసుకోగా.. 2021-22లో ఆ సంఖ్య ఏకంగా 210కు పెరిగింది. మనతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో అత్యధికంగా ఇలాంటి ఘటనలు నమోదు అవుతున్నాయి.21 రాష్ట్రాల పరిధిలోని 262 జిల్లాల్లో కేఎస్సీఎఫ్, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి బాలల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికలో పొందుపరిచాయి.

దాని ప్రకారం రాష్ట్రంలో కొవిడ్ తర్వాత అక్రమ రవాణాకు గురైన బాలల సంఖ్య సగటున 68 శాతం పెరిగిందని వివరించింది. దేశ రాజధాని ఢిల్లీ లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని ఈ నివేదిక పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు