DELHI : పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పట్టుకున్న సీబీఐ!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(NCR)లో  పిల్లలను దొంగతనాలు చేస్తున్న ముఠాను సీబీఐ పట్టుకుంది.వారి వద్ద నుంచి  8 మంది పిల్లలను  రక్షించింది. ఈ కేసులో కొందరిని అదుపులో తీసుకుని విచారిస్తుంది.ఈ ముఠాకు ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉండటంతో సీబీఐ దాడులు నిర్వహిస్తుంది.

DELHI : పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పట్టుకున్న సీబీఐ!
New Update

CBI Action on Kidnapping: దాదాపు 7-8 నవజాత శిశువులను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ(CBI) రక్షించింది.  ఈ కేసులో నలుగురు నిందితులతో పాటు కొందరు వార్డ్ బాయ్‌ లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా వెల్లడించింది. పసిపిల్లలతో సహా 10 ఏళ్లలోపు పిల్లల దొంగతనం, అక్రమ రవాణా కేసులో సీబీఐకి సమాచారం అందాయని సంబంధిత వర్గాలుతెలిపాయి.వీటికి సంబంధించి దర్యాప్తు సంస్థ నిరంతరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

పలు రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్లు:

పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక చర్యలు చేపట్టింది. ఢిల్లీ(Delhi) ఎన్‌సిఆర్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు ఏజెన్సీ సిబిఐ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. కొంత కాలం క్రితం సిబిఐకి అందిన పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు  తెలిపింది. ఆ తర్వాత నిందితులకు సంబంధించిన ప్రదేశాలు, కొన్ని సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు.

దర్యాప్తు సంస్థ సోదాల్లో చాలా ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. నిందితులపై నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో చాలా మంది నవజాత శిశువులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కేశవపురంలో ఇద్దరు చిన్నారులను కూడా రక్షించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు సోదాల్లో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న నీరజ్ అనే వార్డ్ బాయ్, ఇందు అనే మహిళతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కొన్ని ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న నవజాత శిశువుల వ్యాపారానికి సంబంధించి సమాచారం అందాయి.ఆ తర్వాత, శుక్రవారం అర్థరాత్రి, ద్వారక, నార్త్ వెస్ట్ జిల్లా, ఢిల్లీలోని రోహిణి ప్రాంతంతో సహా ఎన్‌సిఆర్‌కు సంబంధించిన కనెక్షన్‌లను పరిశీలిస్తున్నారు.

Also Read : రూ. 66,637 కోట్ల మెగా స్కామ్!

#crime-news #cbi #delhi-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe