/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/maoist--jpg.webp)
Chhattisgarh Naxal Blast: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. మొన్నటి ఎన్‌కౌంటర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బ్లాస్ట్ చేశారు. బస్తర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతుంటగా ఘటన చోటుచేసుకుంది. దాడిలో CRPF అధికారి గాయపడ్డారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
Also Read: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2!
ఇటీవల బస్తర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఎన్నికల్ని బహిష్కరించాలని మావోలు పిలుపు ఇచ్చారు. అయినప్పటికి బస్తర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతుండడంతో ఐఈడీ బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో, బీజాపూర్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా బ్రతుకుతున్నారు.
Follow Us