Chess World Cup final: చివరి నిమిషం వరకు అదే ఉత్కంఠ.. 31ఏళ్ల చెస్ చాంపియన్ కార్ల్‌సెన్‌ని 18ఏళ్ల చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గజగజ వణికించాడు. చెస్ చాంపియన్ ఫైనల్ టై బ్రేక్‌లో కార్ల్‌సెన్ ఆధిపత్యం చలాయించినా ప్రజ్ఞానంద మాత్రం వెనక్కి తగ్గలేదు. కార్ల్‌సెన్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు. అత్యంత వేగంగా.. తెలివిగా మూవ్స్ చేసే కార్ల్‌సెన్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాడు ప్రజ్ఙానంద. నిజానికి మ్యాచ్ మొదలైన టైమ్‌లో ప్రజ్ఞానంద ఓ రాంగ్ మూవ్ చేశాడు. కార్ల్‌సెన్ తన లైట్-స్క్వేర్డ్ బిషప్‌తో తీసిన తన నైట్‌ని f5కి పెట్టడంలో ప్రాగ్ పెద్ద తప్పు చేశాడు. అయినా ప్రజ్ఙానంద కాసేపటికే మళ్లీ లీడ్‌లోకి వచ్చాడు. అయితే ప్రజ్ఞానంద మూవ్స్ కోసం టైమ్ ఎక్కువ తీసుకోవడంతో మళ్లీ డిఫెన్స్‌లో పడిపోయాడు. చివరకు కార్ల్‌సెన్‌నే విజయం వరించింది.
ప్రజ్ఙానందపై మాగ్నస్ కార్ల్‌సెన్ మొదటి 25+10 గేమ్‌లో గెలిచాడు!
ప్రజ్ఙానంద తుదిమెట్టుపై ఓడిపోయినా ఇది గెలుపుగానే భావించవచ్చు. కార్ల్‌సెన్ లాంటి ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్‌ని ముప్పుతిప్పలు పెట్టడం చిన్న విషయం కాదు. అలాంటిది టై బ్రేకర్ వరకు ప్రజ్ఙానంద తీసుకొచ్చాడు. అది కూడా అతి చిన్న వయసులో.. కార్ల్‌సెన్ 19ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్ పిఠంపై కుర్చున్నాడు. ఇప్పుడు ప్రజ్ఞానంద వయసు 18ఏళ్లు. ప్రజ్ఞానంద ఆటతీరు చూస్తుంటే త్వరలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఈజీగానే కనిపిస్తోంది.