IPL: చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో లంక కెప్టెన్! ఐపీఎల్ 2024 చెన్నై సూపరకింగ్స్ జట్టులో శ్రీలంక కెప్టెన్ రాబోతున్నాడు.చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమైన కివీస్ వికేట్ కీపర్ డేవాన్ కాన్వే స్థానాన్నిభర్తీ చేసే పనిలో సీఎస్ కే బృందం పడింది. By Durga Rao 14 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి శ్రీలంక కెప్టెన్ రాబోతున్నాడు.చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమైన కివీస్ వికేట్ కీపర్ డేవాన్ కాన్వే స్థానాన్నిభర్తీ చేసే పనిలో సీఎస్ కే బృందం పడింది. ఐపీఎల్ 2024 ఈ నెల 24 ప్రారంభం కన్నా ముందే కొన్ని జట్ల ఆటగాళ్లను గాయాల బెడద వెంటాడుతుంది. సీఎస్ కే ప్రధాన ఆటగాడు డేవాాన్ కాన్వే చేతివేలి గాయంగా ఈ టోర్నిలో వెనుదిరిగాడు. అతని ప్లేస్ లో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీశ్ తో కాన్వే స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సీఏస్ కే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో కనీస ధర 50 లక్షలకు వచ్చిన ఏ ప్రాంఛేజి అతన్ని కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం మెండీస్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20,వన్టే సిరీస్ లో భీకరమైన ఫాం లో ఉన్నాడు. ఛటో గ్రామ్ లో జరిగిన తొలి వన్డేలో అర్థసెంచరీతో చెలరేగాడు. అయితే మెండీస్ అద్భుతమైన ఆటను కనబరచటంతో సీఎస్ కే అతనిని జట్టులోకి తీసుకునేందుకు సిద్ధమైంది. #chenni-super-kings మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి