AP: తిరుపతి జిల్లాలో చిరుత కలకలం

తిరుపతి జిల్లా చంద్రగిరి కొటాల పంచాయతీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

AP: తిరుపతి జిల్లాలో చిరుత కలకలం
New Update

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. సమీపంలోని శేష చల్ అటవీ ప్రాంతంలోని శేషపురం వెలుపల ఉన్న జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. దూరంగా ఓ బండపై ఉండడంతో బ్రతికి పోయారు. కొందరు దూరం నుంచి ఫోటోలు తీసి పనపాకం ఎస్ ఆర్ ఓ మాధవికి సమాచారం అందించగా ఆయన ఎఫ్ ఎస్ ఓ చైతన్య, అనిత రజిని యుగంధర్ లను పంపించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌..!

చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామస్తులు హడీలు పోతున్నారు. భయభ్రాంతులకు గురై రాత్రి పూట ఇంటి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కాలనీలో గుంపులు, గుంపులుగానే జనం ఉంటున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి చిరుత జాడ ఎక్కడ కనపడలేదన్నారు. గ్రామీణ ప్రజలు పంపిన ఫోటోలు దూరం నుండి తీయడం వల్ల ఆ ఫోటోలో ఉన్నది చిరుతనా లేకపోతే ఇతర జంతువా అనేది స్పష్టంగా తెలియలేదన్నారు. కావున ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అనుక్షణం అటు విశాఖ అధికారులు గస్తీ తిరుగుతూ ఉంటామని అధికారులు తెలిపారు. అయితే, చిరుత కనబడిన ప్రాంతంలో బొను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

#tirupati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe