Talupulamma Temple : ఆషాడమాసం వస్తుందంటే చాలు అమ్మవారి ఆలయాలు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తులు కుటుంబాల సమేతంగా ఈ ఆలయాలకి వెళ్లి వంటావార్పు చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు (Blessings) ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కాకినాడ జిల్లా (Kakinada District) లో లోవకొత్తూరు వద్ద తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఆషాడ మాసం మొదలు అయ్యిందంటే చాలు అక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయం వద్ద టెంకాయ పాటదారుల అక్రమదందా ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
టెంకాయ స్టాల్ దగ్గరే మోసాలకు (Cheating) పాల్పడుతున్న ఓవ్యక్తి అక్రమాల గురించి సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో అసలు భండారం బయటపడింది. భక్తులు తీసుకొచ్చే కొబ్బరికాయ కొట్టకుండా జారివిడిచి...ముందుగా పెట్టుకున్న సగం ముక్కను ఇస్తున్నారడు.
తలుపులమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టే ప్రత్యేక కౌంటర్ దగ్గర భక్తులను దోపిడీ చేస్తున్న వైనం. ఈ విషయం గురించి స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also read: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ!